‘చియాన్’….. బర్త్ డే స్పెషల్

213
Dhruva Natchathiram - Official Teaser
- Advertisement -

కమల్ తరువాత వెండితెరపై ప్రయోగాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే హీరో  విక్రమ్ . పాత్రలో ఒదిగిపోవడానికి .. అభిమానులను మెప్పించడానికి ఆయన ఎంత కష్టమైనా పడుతుంటాడు. అలాంటి విక్రమ్ తాజా చిత్రంగా తమిళంలో ‘ధ్రువ నక్షత్రం’ సినిమా రూపొందుతోంది.విక్రమ్ సరసన రీతూ వర్మ .. ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల కానుంది.

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, ఆ మధ్య వచ్చిన ఫస్టు టీజర్ అందరినీ అలరించింది. ఇవాళ విక్రమ్ 51వ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి మరో టీజర్ ను వదిలారు. ఈ టీజర్లో స్టైలిష్ లుక్ తో విక్రమ్ అదరగొట్టేస్తున్నాడు. ప్రతి ఫ్రేమ్ లోను గౌతమ్ మీనన్ మార్క్ కనిపిస్తూనే వుంది.

విక్రమ్ నికార్సైన హిట్టు కొట్టి చాలాకాలం గడిచిపోయింది. తెలుగులో కూడా మంచి అభిమానగణాన్ని కలిగిన ఈ హీరో అపరిచితుడు తర్వాత తెలుగులో సరైన హిట్టైదీ పొందలేకపోయాడు. చాలా సినిమాలే వచ్చినా ఏవీ కూడా తెలుగు వాళ్లను ఆకట్టుకోలేదు. మరి ఈ సినిమాతోనైనా విక్రమ్ ఆకట్టుకుంటాడో లేదో  వేచిచూడాలి.

- Advertisement -