అమెరికాలో దారుణం…

44
- Advertisement -

అమెరికాలో నాకొక కల ఉంది అన్న జూ.మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్‌ నేటి అమెరికా యువత మర్చిపోతున్నారు. బారాక్ ఒబమా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా తెల్ల జాతీయులు నల్ల జాతీయులపై దాడులను ఆపలేకపోయాడు. దానికి కారణం తెల్ల జాతీయుల నరనరాన జాతి అహంకారం ఉండటమే. తాజాగా పోలీసుల దౌర్జన్యాలకు నల్లజాతి యువకుడు బలైయ్యారు.

ఈ నెల 7న రాత్రి మెంఫిన్ నగరంలో టయిర్ నికోలస్‌ అనే 29యేళ్ల నల్లజాతీయుడ్ని ఐదుగురు పోలీసులు నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక అమ్మా అమ్మా అమ్మా… అని అరుస్తున్నా విచక్షణారహితంగా కొట్టి వెళ్లిపోయారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 10న ప్రాణాలు కోల్పోయాడు. యువకుడిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.

ఇష్టమొచ్చినట్టు కొట్టి అతడిని రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డుపై స్తంభానికి ఉన్న రిమోట్‌ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిలో యువకుడ్ని కొట్టిన 23 నిమిషాల తర్వాత అంబులెన్స్‌ వచ్చినట్టు రికార్డు అయింది. దాంతో పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ అమెరికాలోని పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి…

ప్రగతి పథంలో తెలంగాణ ముందడుగు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో కోలీవుడ్‌ స్టార్ భేటీ

భారత్‌లోని ఫుడ్ ఫారెన్‌లో బంద్…

- Advertisement -