కరోనా నియంత్రణలో భాగంగా భారతదేశం తొలి ఇంట్రానాసల్ టీకాను ప్రారంభించారు. భారత్ బయోటెక్ కంపెనీ వారు తయారుచేసిన ఇన్‌కోవాక్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జిత్రేంద్ర సింగ్ రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేశారు.
గతేడాది డిసెంబర్‌లో బూస్టర్ డోస్‌గా ఇన్‌కోవాక్‌ను డీజీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే టీకాను ప్రభుత్వంకు రూ.325 (జీఎస్టీ అదనం) ప్రైవేట్ కేంద్రాలకు రూ.800 (జీఎస్టీ అదనం) ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ఇన్‌కోవాక్‌ను భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ది చేసింది.
కరోనాకు ప్రపంచంలోనే తొలి నాసికా టీకాగా చెప్పవచ్చు. 18యేళ్లు దాటిన వారికి దీన్ని రెండు ప్రాథమిక డోసులుగా బూస్టర్ డోసుగానూ వినియోగించవచ్చు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల సంస్థ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
ఇజ్రాయెల్…ఏఐ ద్వారా శుభాకాంక్షలు
ట్రంప్ ఫేస్ బుక్ ఈజ్ బ్యాక్..
పవన్ నిప్పులు.. వైసీపీ చురకలు !