6 సంవత్సరాల విరామం తర్వాత మంచు మనోజ్ ఈరోజు తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి వరుణ్ కథ, స్క్రీన్‌ప్లే రాసి మెగాఫోన్‌ను పట్టబోతున్నాడు. ప్రీ లుక్ పోస్టర్ అయితే మంచి వైబ్‌లను క్రియేట్ చేస్తుంది. పోస్టర్ లో బ్యాక్ పోజ్‌లో ఫిట్‌గా కనిపిస్తున్నాడు. మనోజ్ మేకోవర్ బాగుంది. మనోజ్ వెనుక స్టిల్ చూస్తే వేదం లుక్ గుర్తొస్తుంది.
మనం మనం బరంపురం అనేది ట్యాగ్ లైన్ కూడా సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సినిమా షూటింగ్ అందమైన టొరంటో నగరం మరియు కెనడాలోని వివిధ ప్రదేశాలలో 75 రోజుల పాటు జరగనుంది, ప్రతిభావంతులైన తెలుగు నటీనటులు ఇందులో నటించనున్నారు.
వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మంచు మనోజ్ మంచి కం బ్యాక్ ఇచ్చి ఐయాం బ్యాక్ అంటూ సాలిడ్ కంటెంట్ తో చెప్తాడా ? వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి..