ప్రారంభమైన శాసనసభ ప్రత్యేక సమావేశం

213
The start of a special meeting of the Telangana Legislative Assembly
- Advertisement -

రాష్ట్రంలోని గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లుపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. సభను స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. తొలుత జీఎస్టీ, వారసత్వ కట్టడాల బిల్లుపై సభ చర్చించనుంది.

మూడో అంశంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చించనున్నారు. బీసీ-ఈ క్యాటగిరీలోని కులాలకు, ఎస్టీ క్యాటగిరీకి కోటా పెంచేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక రిజర్వేషన్ల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ (రాష్ట్రంలోని విద్యాసంస్థలలో సీట్లు, సర్వీసులలో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్) బిల్లు-2017 ముసాయిదాలో పేర్కొన్నదాని ప్రకారం.. బీసీ-ఈ, ఎస్టీలకు కోటా పెంపుతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 62శాతానికి చేరుకుంటాయని తెలుస్తున్నది. ఇందులో బీసీలకు మొత్తంగా 37శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించారు.

వీటిలో బీసీ-ఏ క్యాటగిరీలో 7శాతం, బీ క్యాటగిరీలో 10%, సీ క్యాటగిరీలో 1%, డీ క్యాటగిరీలో 7%, ఈ క్యాటగిరీలో 12% ప్రతిపాదించారు. ఇక ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లను ప్రతిపాదించారు. రిజర్వేషన్ల బిల్లుతోపాటు తెలంగాణ వారసత్వ కట్టడాల పరిరక్షణ బిల్లు, కేంద్రం నుంచి వచ్చిన జీఎస్టీ బిల్లును కూడా సభ ఆమోదానికి ఉంచనున్నారు.

- Advertisement -