- Advertisement -
రేపు భారత్ – న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ వేదికగా తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేశారు భారత ఆటగాళ్లు.
ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, యజువేంద్ర చాహల్, శుభమన్ గిల్, శార్దూల్‌లు సోమవారం రాత్రి తారక్‌ను కలుసుకున్నారు. అనంతరం తారక్‌తో కలిసి వాళ్లందరూ డిన్నర్ చేసినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం తారక్, కొరటాలతో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -