గ్రీన్ క్యాలెండర్‌ ఆవిష్కరించిన:సంతోష్‌

39
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ఒక మహాయజ్ఞంలా కొనసాగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రకృతి ప్రేమికులు చెట్లను నాటుతూ…వాటిని పరీరక్షిస్తూ పర్యావరణంకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌​ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం అన్నారు.

ఈ సందర్బంగా ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్‌​ కుమార్ స్వయంగా తన కెమెరాలో బంధించిన చిత్రాలతో ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ముద్రించిన క్యాలెండర్‌ను ఈ రోజు ప్రగతి భవన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్‌​ కుమార్ ఆవిష్కరించారు.

అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ… తాను తీసిన చిత్రాలతో క్యాలెండర్‌ను రూపొందించిన అనిల్ ను అభినందించారు. ఇది తనకో జ్ఞాపకంగా నిలుస్తుందని… ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, సర్దార్ రవీందర్ సింగ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

అండగా నేనుంటా..ఎంపీ సంతోష్‌

గ్రీన్ ఛాలెంజ్‌లో జోడి మెకే..

ఉత్తర భారతదేశాన్ని వణికిస్తోన్న చలి..

- Advertisement -