ప్చ్.. ఆ ప్లాప్ భామకు 2 కోట్లా ?

80
- Advertisement -

యంగ్ హీరోయిన్ అనన్య పాండే అందం కుర్రకారుకి నచ్చింది. పైగా అనన్య పాండే నటన కూడా ఇంప్రెస్ చేసింది. ‘లైగర్’ సినిమాలో కమర్షియల్ హీరోయిన్ గా అదరగొట్టిన అనన్య పాండే తెలుగులో మాత్రం బిజీ కాలేకపోయింది. నిజానికి అనన్య పాండే గ్లామర్ చూసినప్పుడే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ అనన్య పాండేకి రెండో ఆఫర్ రావడానికి ఎక్కువ కాలం పట్టింది.

మొత్తమ్మీద విజయ్ దేవరకొండ లైగర్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనన్య. అయితే, ఆ క్రేజ్ ను అనన్య పాండే క్యాష్ చేసుకునే పనిలో ఉంది. తన పారితోషికం విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. భారీగా అనన్య పాండే మనీ డిమాండ్ చేస్తోంది. ఆమె అలా మొహమాటం లేకుండా డిమాండ్ చెయ్యడంతో అనన్య పాండేని అప్రోచయిన పలువురు దర్శక, నిర్మాతలు ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నారు. దాంతోనే ఆమెకు రెండో సినిమా ఇంతవరకు ఫిక్స్ కాలేదు.

ఐతే, హీరో రామ్ తో తమ తర్వాత చిత్రాన్ని రూపొందిస్తోన్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాత్రం అనన్య పాండే అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారు. అలా అనన్య పాండే తన తర్వాత తెలుగు సినిమాకి సైన్ చేసింది. రామ్ చేయబోతున్న కొత్త చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. మరీ అనన్య పాండేకి రామ్ సినిమా కూడా బాగా కలిసొచ్చేలా ఉంది. ఇంతకీ ఈ సినిమాకి అనన్య పాండే ఎంత అడుగుతుందో తెలుసా ?, దాదాపు 2 కోట్ల పైనే.

రామ్, అనన్య పాండే కాంబినేషన్ అదిరిపోతుందా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ సరసన అదరగొట్టిన అనన్య పాండే రామ్ కి కూడా మంచి జోడి అనిపించుకుంటే ఆమె విషయంలో ఇక నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. కానీ ప్లాప్ భామకు 2 కోట్లు అంటే ఎక్కువే.

ఇవి కూడా చదవండి…

జనవరి14న రానున్న వారసుడు:దిల్‌ రాజు

సూర్య42..టైటిల్ ఫిక్స్‌..!

కన్నీటి పర్యంతమైన సమంత…

- Advertisement -