సీఎం కేసీఆర్‌ రైతన్న నేస్తం:హరీశ్‌

20
- Advertisement -

తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచిన ఏకైక సీఎం తెలంగాణ సీఎం అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు పెట్టుబడి సాయంగా రూ.65వేల కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమచేశామని తెలిపారు. రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా, రైతు బిడ్డగా రైతుల గోసలను ఉద్యమ కాలంలో దగ్గరుండి చూసి చలించిపోయిన ఉద్యమనాయకుడు మన సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

అనంతరం మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ…రైతు అకారణంగా చనిపోతే రైతు భీమా ద్వారా రూ.5లక్షలు ఇచ్చి ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఇప్పటివరకు 98వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా అందించామని…ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుందని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులు ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతులకు రైతు బంధు జమచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

తూప్రాన్‌లోని మండే ఎండలో కూడా హల్దీ వాగు చెక్‌డ్యామ్‌లపై నుంచి మత్తడి దూకుతుందని అన్నారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా పూర్తిచేయలేదని మండిపడ్డారు. తూప్రాన్్లో ఇప్పటివరకు మూడు మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు.

ఇవి కూడా చదవండి…

ఐటీ..బెంగళూరును దాటేసిన హైదరాబాద్‌

ఖమ్మంలో బీఆర్ఎస్ పొలికేక..

ఏపీ బీఆర్ఎస్‌..దూకుడు పెంచిన కేసీఆర్

- Advertisement -