కింగ్స్‌పై గంభీర్‌ సేన ఘనవిజయం

198
Gambhir, Umesh script Kings XI thrashing
- Advertisement -

సొంతగడ్డపై కోల్‌కతా ఆల్ రౌండ్ ప్రతిభతో సత్తాచాటింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ అన్ని విభాగాల్లో సత్తా చాటిన నైట్‌రైడర్స్‌.. పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 16.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ గంభీర్ 49 బంతుల్లో 11 ఫోర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా పాండే స్టోనిస్ బౌలింగ్ లో సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించాడు.

Gambhir, Umesh script Kings XI thrashing
ఎవరు ఉహించని విధంగా స్పిన్నర్ సునీల్ నరైన్ ఓపెనర్‌గా వచ్చి అందరిని ఆశ్చర్య పర్చాడు. అందరి అంచనాలను తలదన్నేలా బ్యాటింగ్ శైలీతో రెచ్చిపోయిన నరైన్‌ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆడుతోంది టెయిలెండరేనా అనిపించేలా పంజాబ్‌కు చేయాల్సిన నష్టాన్ని చేసేశాడు. సునీల్‌ నరైన్‌ (37; 18 బంతుల్లో 4×4, 3×6) చేయగా  కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (72 నాటౌట్‌; 49 బంతుల్లో 11×4) నిలకడ తోడవడంతో  కోల్‌కతా పంజాబ్‌ను చిత్తు చేసింది.  బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన నరైన్‌ (1/19)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌ ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగే. మాక్స్‌వెల్‌ (25; 14 బంతుల్లో 3×4, 1×6) వికెట్‌తో సహా నాలుగు వికెట్లు తీసిన ఈ పేసర్‌ ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఉమేశ్‌ వేసిన 18వ ఓవర్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌. తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌ ఇచ్చుకున్న అతను.. ఆ తర్వాత నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసి పంజాబ్‌ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. మిల్లర్‌ (28), సాహా (25)తో పాటు అక్షర్‌పటేల్‌ (0)ను కూడా ఔట్‌ చేసి పంజాబ్‌ను దెబ్బ కొట్టాడతను. అంతకుముందు ఆమ్లా (25), వోహ్రా (28) శుభారంభం అందించారు. ఐతే మాక్స్‌వెల్‌ను ఉమేశ్‌ ఔట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. చివరి ఓవర్లో వోక్స్‌ (2/30) రెండు వికెట్లు తీశాడు.

- Advertisement -