2014 ఏప్రిల్ 4 తేదిన అమృత ప్రోడక్షన్ బ్యానర్ లో స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో రూపోంది టాలీవుడ్ లో సంచలనాలకు దారి తీసిన చిత్రం హ్రుదయకాలేయం. ఈ చిత్రం ద్వారా ప్రముఖ పారిశ్రామిక వేత్త సంపూర్జేష్ బాబు హీరోగా పరిచయం అయ్యి ప్రపంచంలో వున్న తెలుగు ప్రేక్షకులు అందించిన రికార్డుల ప్రేమకు బానిసయ్యాడు. భాహుబలి చిత్రం తరువాత అంత లాంగ్ షెడ్యూల్ చేసుకున్న చిత్రం గా తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో మరొక్కసారి తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఈ చిత్రం ద్వారా తన వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన రూపక్ రోనాల్డ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఎన్నో వ్యయప్రాయసాలు పడి అహర్నిశలు వందరల మంది టెక్నిషియన్స్ తో నటీనటులతో హైదరాబాద్ శివారు గ్రామాల్లో, కొనసీమ ప్రాంతాల్లో అత్యంత భారీ షెడ్యూల్ చేసుకుని ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వుంది. గత కొంతకాలం క్రిందట విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికి టాలీవుడ్ లాంగెస్ట్ టీజర్ గా రికార్డు నిలిచిపోవటమే కాకుండా సోషల్ మీడియాలో రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పుడు డైనమిక్ దర్శకుడు , అందరి డార్లింగ్ దర్శకుడు పూరిజగన్నాథ్ చేతుల మీదుగా కొబ్బరిమట్ట చిత్రం నుంచి శంభో శివ శంభో సాంగ్ టీజర్ ని విడుదల చేశారు..
ఈ సందర్బంగా పూరిజగన్నాధ్ మాట్లాడుతూ… బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం.. సంపూతో చాలా సార్లు పనిచెయ్యాలి కుదరలేదు. తప్పకుండా భవిష్యత్తు లో చేస్తాను. కొబ్బరిమట్ట టైటిల్ నే చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సాంగ్ చూసాను మాటలు లేవు మాట్లాడుకొవటాలు లేవు.. ఓన్లి చూడటాలే.. చాలా బాగుంది. ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన స్టీవెన్ శంకర్ కి అలాగే దర్శకుడు రూపక్ రోనాల్డ్ కి ఇందులో పనిచేసిన నటీ,నటులకి, సాంకేతిక నిపుణులకి నా బెస్ట్ విషెస్ అని అన్నారు
నిర్మాతలు ఆది కుంబగిరి, సాయి రాజేష్ నీలం లు మాట్లాడుతూ.. అమృత ప్రోడక్షన్, సంజన మూవీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కొబ్బరి మట్ట. ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో వుంది. డార్లింగ్ అండ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాధ్ గారి చేతుల మీదుగా మా మెదటి సాంగ్ ని విడుదల చేశాము. మేము అడిగిన వెంటనే ఎంతో బిజిగావున్నా కూడా మాకు టైం ఇచ్చినందకు పూరి గారికి మా ధన్యవాదాలు. అలాగే మా టీజర్ సృష్టించిన రికార్డులు మాదిరిగానే మా ఈ సాంగ్ టీజర్ కూడా రికార్డుల డ్యామ్ ఓపెన్ చేసింది. సంపూర్ణేష్‌బాబు గారితో మా రెండవ చిత్రం చేయటం చాలా ఆనందంగా వుంది. హ్రుదయకాలేయం చిత్రం కంటే మూడింతలు నవ్విచే విధంగా స్టీవెన్ శంకర్ కథ, మాటలు అందించగా, దర్శకుడు రూపక్‌రోనాల్డ్ తెరకెక్కించాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా టాలీవుడ్ పెద్ద చిత్రాలకు ధీటుగా ముజీర్ మాలిక్ కెమెరా అందించారు. ఈ విజువల్స్ చూసిన ప్రతి ఓక్కరూ విజువల్స్ చాలా గ్రాండియార్ గా వున్నాయని చెప్పటం విశేషం. అతిత్వరలో మరిన్ని విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాము అని అన్నారు.