పవర్‌స్టార్‌ స్పీచ్‌పై సంపూ కామెంట్స్…!

337
- Advertisement -

టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే ఎక్క‌డ లేని ఇమేజ్ సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్‌ బాబు. హృద‌య‌ కాలేయం, సింగం 123 సినిమాల‌తో డిఫ‌రెంట్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బర్నింగ్‌ స్టార్‌కు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అటు సైడ్‌ క్యారెక్టర్స్‌ మరోవైపు హీరోగా బిజీగా ఉన్న సంపూ తాజాచిత్రం కొబ్బ‌రిమ‌ట్ట‌. కొద్ది రోజులుగా టీజ‌ర్ల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న కొబ్బ‌రిమ‌ట్ట ఇప్పుడు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో అంద‌రికి షాక్ ఇస్తోంది.  రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆది కుంభగిరి, సాయి రాజేష్‌ నీలం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Burning Star Differentiated Between Pawan Kalyan
ఇదిలా ఉంటే బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై ట్వీట్టర్‌ ద్వారా ప్రశంసలు గుపించాడు. అమెరికాలో పవన్‌ ప్రసంగంపై స్పందించాడు…పవన్‌ స్పీచ్‌ని లోతుగా పరిశీలిస్తే కడుపు నిండిన నాయకుడికి కడుపు మండిన నాయకుడికి ఉన్న తేడా కనిపిస్తుంది అంటూ ట్వీట్టర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు సంపూ. ఇది చూసిన కొంత మంది నెటిజన్లు పవన్‌ పార్టీలో జాయింన్‌ కావడనికే సంపూ ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని కామెంట్లు విసురుతున్నారు. మొత్తం మీద సంపూ పవన్‌ మీద చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Burning Star Differentiated Between Pawan Kalyan
అంతేకాకుండా తెలంగాణరాష్ట్రానికి చెందిన బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు ఇటీవలే ఏపీ ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమానికి మద్దతు తెలిపి…. విశాఖపట్నంలో అరెస్ట్‌ కావడం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన పిలుపు మేరకే ఆర్కెబీచ్‌కు వచ్చానని చెప్పి వార్తల్లో నిలిచాడు సంపూ. ఏది ఏమైనప్పటికీ సంపూర్ణేష్‌ బాబు ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.

- Advertisement -