బాలయ్యతో పవన్

108
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పవన్ కళ్యాణ్ ఓ ఎపిసోడ్ లో కనిపించబోతున్న సంగతి పాతదే. ఇవ్వాళ ఈ ఎపిసోడ్ షూట్ మొదలైంది. పవన్ సెట్ లోకి రావడం బాలయ్య అండ్ ఆహా టీం ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటివల బాలయ్య – పవన్ ఇద్దరు వీరసింహ రెడ్డి సెట్లో కలుసుకున్నారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకోనున్నారు. ఇవ్వాళ మధ్యాహ్నం వరకూ షూట్ జరగనుంది.

పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు క్రిష్ ఎపిసోడ్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. అలాగే వీడియో కాల్ లో తేజ్ కనిపిస్తాడని మావయ్య విషయాలు ఏవో చెప్తాడని అంటున్నారు. బాలయ్య -పవన్ కళ్యాణ్ ఇద్దరూ పొలిటికల్ విషయాలు కూడా షోలో చర్చించే అవకాశం ఉంది. జనసేన పార్టీ ఎందుకు పెట్టావ్ అనే ప్రశ్న బాలయ్య నుండి పవన్ కి రానుంది. మరి పవన్ ఈ షో లో ఏం మాట్లాడతారో ? బాలయ్య తో ఎలాంటి కన్వర్జేషన్ చేస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -