టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం చలపతిరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక చలపతిరావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చలపతిరావు హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మా కుటుంబంతో ఆయనకు ఆత్మీయ బంధం ఉంది. నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారని గుర్తుచేశారు బాలయ్య.
చలపతిరావు అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు ఎన్టీఆర్. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చలపతిరావు మృతిపట్ల కల్యాణ్ రామ్ సంతాపం తెలిపారు.
చలపతిరావు కన్నుమూయడం చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారని గుర్తు చేసుకున్నారు. చలపతిరావు మృతిపట్ల తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు.
ఇవి కూడా చదవండి..