పాపారావును కలిసిన పవన్‌…

24
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌… ముందుగా ఎన్నికల ప్రచారం రథం వారాహిని హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి ఆర్టీఏ అధికారులు ts13 ex 8384 నెంబర్‌ను కేటాయించిన విషయం తెలిసిందే.

పవన కళ్యాణ్ ఖైరతాబాద్‌ కేంద్ర కార్యాలయంలో ఉప రవాణా కమిషనర్‌ పాపారావును కలిశారు. ఈ సందర్భంగా మరో ఐదు వాహానాలకు అనుమతులు కావాలని కోరారు. దీంతో పాటుగా ఇంటర్‌నేషనల్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ కావాలని కోరారు.  త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

వైఎస్‌ఆర్ పార్టీని అధికారంను నుంచి గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన పవన్ గతంలోనే తెలిపారు. ఇదిలా ఉంటే పాత కరీంనగర్‌ జిల్లా నూతన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి…

పవన్ ప్లాన్ కు.. అంబటి విల విల!

క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్‌….

కవిత ఫైర్.. అండగా నెటిజన్స్ !

- Advertisement -