నాడు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేశామని కానీ నేడు దేశం కోసం పోరాడాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాడు జైతెలంగాణ నేడు జైభారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం పాటుపడుదామని పిలుపునిచ్చారు. తప్పకుండా యావత్ సమాజం ముందుకు పురోగమించే అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కులం, మతం, వర్గం, జాతి అనే వివక్ష లేకుండా అందరితో అన్ని విషయాలు పంచుకుంటూ అన్ని పండుగలను చాలా గొప్పగా, ఉన్నంతలో ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా, సంతోషంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ సాధించినటువంటి పురోగతి యావత్ దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో రావాలి అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దాని కోసమే మళ్లీ మనం కొత్త యుద్ధానికి, కొత్త సమరానికి శంఖం పూరించాం. తప్పకుండా తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి, ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, శాంతికాముక దేశంగా, పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందులో మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపిన కేసీఆర్ జై భారత్ నినాదించారు.
ఇవి కూడా చదవండి…
కవిత ఫైర్.. అండగా నెటిజన్స్ !
తల్లీబిడ్డల క్షేమం కోసమే ఈ కిట్:హరీశ్
కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు శ్రీకారం..