SSMB28 కోసం లాంగ్ షెడ్యూల్

159
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో సినిమా షూటింగ్ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. జనవరి రెండో వారంలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా మార్చి చివరి వరకు కొనసాగనుంది. ఇది దాదాపు 60 రోజుల పాటు సాగే లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తుంది.

ఆగస్ట్ 11న 2023 (స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకం) రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. #SSMB28 అతడు ,ఖలేజా తర్వాత మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

థమన్ ఎస్ ఇటివలే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రెండు ట్యూన్‌లను ఫైనల్ చేశాడు. త్రివిక్రమ్ ,థమన్ కాంబో అల వైకుంఠపురములోతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. మహేష్ అభిమానులు దానికంటే అదిరిపోయే ఆల్బం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్

డిసెంబర్‌24..మా బావ మనోభావాలు సాంగ్‌

2022…మలయాళ టాప్ సినిమాలు

- Advertisement -