కోలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై అనతి కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలై అఖండ విజయం సాధించిన సినిమా లవ్టూడే. మొన్నటి వరకు కమర్షియల్ కోణంలో సినిమాలు చూసే ప్రేక్షకులు…ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుంది.
5కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం తమిళంలో వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించి ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్లో ఒకటిగా నిలిచింది.ప్రదీప్, ఇవానా నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ మూవీ తమిళ వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇక తెలుగు వెర్షన్ క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్ చేయాలని చిత్రబృందం భావిస్తుందట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్లో సమాచారం.
ఇవి కూడా చదవండి…