క్యాస్టింగ్ కౌచ్‌…మహానటి స్పందన!

123
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన పేరు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా తారలు కూడా సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నారు. అయితే తమ చేదు అనుభవాలను పంచుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎప్పుడైతే మీటూ ఉద్యమం తెరపైకి వచ్చిందో చాలామంది తారలు క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు. అవకాశాల కోసం తామెంతటి అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నామో ధైర్యంగా బయటపెట్టారు.

హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఎవర్నీ వదల్లలేదు. అంతేకాదు. తెలుగు సిని ప్రపంచంలో కూడా క్యాస్టింగ్ కౌచ్‌ ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కోవలలోకి ప్రముఖ నటి మహానటి ఫేం కీర్తి సురేష్ కూడా చేరారు.

క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడుతూ… ఇప్పటివరకూ నాకెలాంటి వేధింపులు ఎదురు కాలేదు. క్యాస్టింగ్ కౌచ్‌ అనేది మన ప్రవర్తనను బట్టి ఉంటుందేమో అందుకే ఇలాంటి సంఘటన నాకు ఎదురు కాలేదు. నాతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు సినిమా తారలు కూడా దీని గురించి నాకు చెప్పారు. ఒక వేళ నావరకు వచ్చి ఉండుంటే సినిమాలు మానేసి జాబ్ చేసుకునేదాన్ని అని కీర్తి పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహేష్ సర్కార్‌ వారిపాట సినిమాతో హిట్‌ అందుకోంది.

ప్రస్తుతం ఈ అమ్మాడి నానితో దసరా సినిమాను చేస్తుంది. అందులో ఇటివలే సినిమా మేకర్స్ మాస్‌ లుక్‌తో కూడిన ఫోటోను విడుదల చేశారు. అలాగే భోళాశంకర్‌ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది. వీటితో పాటు మామన్నన్‌, సైరన్‌ సినిమాల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి….

మహేష్ సినిమా పై కొత్త ముచ్చట్లు

ఆమె ఏకంగా ఎన్టీఆర్ తోనే..

బాలయ్య సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా!

- Advertisement -