యాంకర్స్ కు వేధింపులు.. కటకటాల్లోకి నిందితుడు !

149
- Advertisement -

ఆన్‌ లైన్‌లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్న హాట్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకటి. ఆ మధ్య తనను వేధిస్తోన్న ఆకతాయిలపై రష్మీ గౌతమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రష్మీ గౌతమ్ ను సోషల్ మీడియాలో వేధింపులు చేసింది ఆ వ్యక్తే అని తేలింది. ముఖ్యంగా రష్మీ గౌతమ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వాటిని అందరికీ షేర్ చేస్తున్నారని తేలింది.

మొత్తానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఆ నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయితే, ఒక్క రష్మీ గౌతమ్ మాత్రమే ఇలాంటి కంప్లైంట్ చేయలేదు. అనసూయ కూడా ఇదే కంప్లైంట్ చేసింది. ఆ వ్యక్తి అనసూయ పై కూడా దారుణంగా ట్రోల్ చేసేవాడట. పైగా నేరుగా ఆమెకే నీచంగా మెసేజ్ లు కూడా పెట్టేవాడట. మొత్తానికి పోలీసులు, ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు, ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజే ఆ వ్యక్తి అని తేలింది.

మరి ఇప్పుడు అతని పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. అయినా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. హీరోయిన్లతో పాటు, యాంకర్ల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న వారందరికీ బుద్ది చెప్పాలి అంటే.. పోలీసులు ఈ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే మిగిలిన ఆకతాయిలు ఇలాంటి వ్యవహారాలు జోలికి రాకుండా ఉంటారు. అసలు ఈ మార్ఫింగ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడం కారణంగా ఎందరో మహిళలు నిత్యం బాధ పడుతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

ఈ వారం ఓటీటీ కంటెంట్ పరిస్థితేంటి ?

ఆర్సీ16 కన్ఫం….

స్మగ్లర్‌గా నితిన్‌….

- Advertisement -