ఆర్సీ16 కన్ఫం….

64
- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ మరింత ఎత్తుకు ఎదిగింది. తాజాగా తమిళ శంకర్‌తో కలిసి ఆర్సీ15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శంకర్‌ సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది కాబట్టి మరో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగనున్నారు మెగా పవర్ స్టార్‌. ఇదిలా ఉండగా చరణ్ నెక్ట్స్ సినిమా గురించి టాలీవుడ్‌లో చర్చ జరగుతుండగా తాజాగా దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది.

ఉప్పెన సినిమా ద్వారా తనదైన శైలి మార్క్‌ను చూపిన బుచ్చిబాబు….రామ్‌చరణ్‌ తదుపరి సినిమాను తీయనున్నారని అఫీషయల్ ప్రకటన వెలువడింది. దీంతో మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ భారీ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఏదేమైనా చరణ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

అతని కోసం ప్రభాస్ -బన్నీ మధ్య పోటీ !

తమ పెళ్లితో షాక్ ఇచ్చిన హీరోహీరోయిన్లు.. పిక్స్ వైరల్ !

మహేశ్‌కు హిట్ ఇచ్చి తీరుతా!

- Advertisement -