కృతి సనన్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా 1నేనొక్కడినే. నటన ప్రాధాన్యమున్న పాత్రలు ఎంపిక చేసుకోవడం వల్ల ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందిన కృతి. తాజాగా తను వార్తలో నిలిచిపోయింది. కృతి తన మనసులో మాటను బయటపెట్టింది. భేదియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీడియా దొరికిపోయింది.
విషయమేంటంటే.. ఓ టీవి డిబెట్‌లో కృతి సనన్‌కు కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్ వీరిలో ఎవరిని పెళ్ళి చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ అమ్మడు ప్రభాస్‌ను పెళ్ళి చేసుకుంటా అని సమాధానం ఇచ్చింది. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్, కృతి కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించారు. కాగా వీరిద్ధరూ ఆదిపురుష్ ప్రెస్‌మీట్‌లలో, టీజర్ ఈవెంట్‌లో క్లోజ్‌గా ఉండటంతో వీరిద్ధరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఈ ఇద్దరూ స్పందించలేదు.
ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో సీతారాములుగా కృతి ప్రభాస్ నటించిన విషయం తెలిసిందే. అయితే టీజర్ విడుదల సమయంలో అనేక విమర్శలు రావడంతో సినిమాను వచ్చే యేడాది జూన్ నెలకు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. దానికి కారణం విఎఫ్‌ఎక్స్ సరిగ్గా లేకపోవడమే సినిమాపై విమర్శలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి…