గుజరాత్‌లో మొదటి 5జీ ట్రూ సర్వీస్‌

236
- Advertisement -

టెలికాం రంగంలో విదేశి కంపెనీలను తట్టుకొని భారత టెలికాంలో ప్రథమ స్థానంలో నిలిచిన జీయో. తాజాగా మరో కీలక ముందడుగు వేసింది. భారతదేశమంతటా తన ట్రూ 5జీ సర్వీసులను వేగంగా అందిస్తోంది.జీయో టెలికాం ఆపరేటర్‌ ఇప్పటికే 12నగరాల్లో సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్‌లో కూడా 5జీ సేవలను ప్రారంభించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ 33జిల్లా ప్రధాన కార్యాలయంలో 100శాతం 5జీ కవరేజీని అందించిన మొదటి భారతీయ రాష్ట్రంగా గుజరాత్‌ను ప్రకటించారు.

నవంబర్ 25 నుంచి గుజరాత్‌లోని జియో యూజర్లు తమ జియో వెల్‌కమ్ ఆఫర్‌ కు ఇన్వైట్ చేస్తుంది. 1gbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చునని Jio అధికారిక ప్రకటనలో తెలిపింది. Jio True 5Gగా పిలిచే వేగవంతమైన నెట్‌వర్క్ సర్వీసులు గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, IOT రంగాలలో జియో 5G-ఆధారిత కార్యక్రమాలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియోకు సాయపడతాయి.

Jio రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ‘అందరికీ విద్య’ పేరుతో నిజమైన 5G-ఆధారిత సర్వీసులను ప్రకటించింది. ఈ చొరవతోనే టెలికాం దిగ్గజం గుజరాత్‌లోని 100 పాఠశాలలను మొదట్లో డిజిటలైజ్ చేయాలని, ఇలాంటి 5G సర్వీసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త 5G సర్వీసులు 4G సిమ్‌లకు ఆటోమాటిక్‌గా కనెక్ట్ అవుతాయని 5G లాంచ్ సందర్భంగా Jio తన యూజర్లకు హామీ ఇచ్చింది. కాబట్టి 5G కనెక్టివిటీని పొందడానికి కస్టమర్‌లకు కొత్త సిమ్ అవసరం లేదు. అయితే, Jio యూజర్లందరూ వెల్‌కమ్ ఆఫర్‌ను ఉపయోగించుకోలేరు.

ఇవి కూడా చదవండి…

ఎమ్మెల్యేల కొనుగోలు..నిందితుల రిమాండ్ పొడగింపు

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా…

ప్రచార రథాన్ని కాపీకొట్టిన పవన్‌!

- Advertisement -