కృష్ణ మృతిపై డాక్టర్లు..

151
gurunatha reddy
- Advertisement -

అనారోగ్యంతో సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందారు. ఇక కృష్ణ మృతిపై కాంటినెంటల్ హాస్పటిల్ ఛైర్మన్‌ గురునాథ రెడ్డి స్పందించారు. కృష్ణ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండేనని… అన్ని అవయవాలు దెబ్బ తిన్నాయన్నారు. ట్రీట్మెంట్ చేశాం… సాయంత్రం అయన పరిస్థితి విషమించిందన్నారు. ఇవాళ ఉదయం 4గంటల 9 నిముషాలకు చనిపోయారని తెలిపారు. అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

1942 మే 31 గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. నాలుగు దశాబ్దాలకుపైగా 340 పైగా సినిమాల్లో నటించారు.

1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తెరకెక్కించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంతంగా పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -