చలనచిత్ర రంగానికి తీరని లోటు..

114
Harishrao
- Advertisement -

ప్రముఖ చలనచిత్ర నటుడు, సినీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ హరీశ్ రావ్ సంతాపం వ్యక్తం చేశారు.350కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియుల హృదయాల్లో సూపర్ స్టార్ గా నిలిచారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధితనేతగా ఆయన చలన చిత్ర రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

పౌరాణిక, కుటుంబ, సాంఘీక చిత్రాల్లోను, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రాత్మక పాత్రలను, కౌబాయ్, జెమ్స్ బాండ్ తరహా విభిన్న పాత్రలు పోషించి సినీ ప్రియులను కృష్ణ రంజింపజేశారని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఘట్టమనేని శివరామ కృష్ణ మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -