బుర్రిపాలెం బుల్లోడు..

158
krishna superstar
- Advertisement -

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. విలక్షణ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఇవాళ ఉదయం 4.10 గంటలకు మృతిచెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందారు. కృష్ణ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

1942 మే 31 గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. నాలుగు దశాబ్దాలకుపైగా 340 పైగా సినిమాల్లో నటించారు.

1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తెరకెక్కించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంతంగా పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు.

జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. సూపర్‌ స్టార్‌కు ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) వరించాయి. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేశ్‌ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు.

ఇవి కూడా చదవండి..

చలనచిత్ర రంగానికి తీరని లోటు..

- Advertisement -