యశోద..అదిరే ప్రీ బిజినెస్!

92
yashoda
- Advertisement -

విభిన్న తరహా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న బ్యూటీ సమంత. తాజాగా యశోద అనే పాన్ ఇండియా సినిమాతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యశోద సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్లకి, హిందీలో 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1 కోటి రూపాయలకి, ఓవర్సీస్ 2.5 కోట్లకి థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి.మొత్తంగా దాదాపు 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ యశోద సినిమాకి జరిగింది. ఓ ఫీమెల్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక శాటిలైట్ హక్కులు దాదాపు 10 కోట్లకి, డిజిటల్ హక్కులు దాదాపు 20 కోట్లకి అమ్ముడుపోయినట్టు సమాచారం. విడుదల తర్వాత యశోద్ ఎన్ని రికార్డులు బ్రేక్‌ చేస్తుందో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -