భారత్ జోడో యాత్రకు మునుగోడు ఉప ఎన్నికకు ఎటువంటి సంబంధంలేదని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మునుగోడు ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్‌ఖేరా ఏఐసీసీ అధికార ప్రతినిధి కుసుమ కుమార్ మీడియా కమిటీ ఛైర్మన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మునుగోడులో జరిగింది కేవలం మద్యం మనీ ఎన్నికలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి 15రోజులు మునుగోడులో ఏం జరిగిందనే ప్రజలందరికి తెలుసని దానిపై మేం ఏం మాట్లాడలేమని అన్నారు. మూమ్మాటీకి మునుగోడులో ప్రజామస్వామ్యాన్ని కూనీ చేసి గెలిచరాని అన్నారు.
పాల్వయి స్రవంతి గొప్ప ధైర్యం ఉన్న వ్యక్తి అని ఈ సందర్భంగా కితాబు ఇచ్చారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య స్రవంతి నిలిచిందని అన్నారు. అయితే సాధారణ ఎన్నికలైతే స్రవంతి గెలిచేదని…అసాధారణ ఎన్నికలు కాబట్టి గెలవలేదన్నారు. ఒక్క మునుగోడులో 200 కోట్ల మద్యం తాగించి గెలిచారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెట్టింపు ఉత్సాహంతో కొత్త శక్తితో దూసుకెళ్లుతున్నామని…రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన రాజ్‌గోపాల్‌రెడ్డి ఓడిపోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై సమీక్ష నిర్వహిస్తామని అందుకు తగిన ఆధారాలు ఉంటే దోషులకు కఠిన శిక్ష పడుతుందని తెలిపారు. ఇప్పటికే కోమటిరెడ్డి పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని…రిప్లై ఇస్తే ఏఐసీసీ చూసుకుంటుందని జైరాం రమేష్ అన్నారు. పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అవసరమని…గీత దాటితే చర్యలు తప్పవని అన్నారు.
ఇవి కూడా చదవండి..