మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 4 రౌండ్ల ఫలితాలు పూర్తికాగా టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక తొలి నాలుగు రౌండ్లు చౌటుప్పల్ కి సంబంధించి జరుగగా ఇక్కడ లీడ్‌పై బీజేపీ,ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి భారీ ఆశలు పెట్టుకున్నారు. కనీసం 5వేల మెజార్టీ వస్తుందని రాజగోపాల్ భావించగా అనూహ్యంగా టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది.
దీంతో తీవ్రంగా నిరాశ చెందారు రాజగోపాల్ రెడ్డి. అర్బన్ ప్రాంతంలో 5 వేల మెజార్టీ వస్తుందని భావించానని కానీ తాను అనుకున్న ఫలితం రాలేదన్నారు. ఈ ఫలితాలు తనను నిరాశపర్చాయని తెలిపారు.
ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా 5వేల మెజార్టీతోనే గెలుస్తారని, ఇప్పుడున్న సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వ వ్యతిరేకంగానే జరిగిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఒకవేళ సైలెంట్ ఓటింగ్ అనేది బీజేపీకి అనుకూలంగా పడితే తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..