దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ సంచలన విజయం

348
- Advertisement -

టీ20లో వరల్డ్ కప్‌లో మరో అద్భుతం జరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ సంచలన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8 వికెట్లు కొల్పోయి 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సెమిస్ ఆశలు గల్లంతైన దక్షిణాఫ్రికా.. ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 158 పరుగులు చేసింది. నెదర్లాండ్ జట్టులో మైబర్గ్ 30 బంతుల్లో 37 పరుగులు, టూమ్ కూపర్ 19 బంతుల్లో 35 పరుగులు, అకెర్మన్ 26 బంతుల్లో 41 పరుగులు చేశారు. అకెర్‌మాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది. దక్షిణాఫ్రికా ఓటమితో భారత్ నేరుగా సెమిస్‌కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -