- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి 714 ఓట్ల ఆధిక్యంలో ఉంది టీఆర్ఎస్. నాలుగో రౌండ్ వరకు టీఆర్ఎస్‌కు 26443,బీజేపీకి 25729 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 7380 ఓట్లు వచ్చాయి.
ఇక నల్గొండ కౌంటింగ్ కేంద్రం వద్ద షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అత్యధిక ఓటర్లు ఉన్న మండలం చౌటుప్పల్. చౌటుప్పల్‌లో మొత్తం పోలైన ఓట్లు 55,678. చౌటుప్పల్ మండలంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇక పోస్టల్ బ్యాలెట్‌లో 4 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది టీఆర్ఎస్. టీఆర్‌ఎస్-228, బీజేపీ-224,కాంగ్రెస్ -136 బీఎస్పీ-10, ఇతరులు-88 ఓట్లు పడ్డాయి.
ఇవి కూడా చదవండి..
- Advertisement -