- Advertisement -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడుపెంచింది. గుజరాత్ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న ఆప్…అవినీతి లేని పాలనే లక్ష్యంగా ముందుకొస్తున్నామని తెలిపారు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక ఆప్ సీఎం అభ్యర్థిగా జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్విని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించారు.
డిసెంబర్ 1న మొదటి, 5న రెండవ దశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 77 స్థానాలను కైవసం చేసుకొని రెండో స్థానానికి పరిమితమైంది. ఇక ఈసారి త్రిముఖ పోరు బీజేపీ,ఆప్,కాంగ్రెస్ మధ్య జరగనుంది.
- Advertisement -