కొన్ని గంటలే జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌..

160
Trai forces Reliance Jio to withdraw Surprise offer
Trai forces Reliance Jio to withdraw Surprise offer
- Advertisement -

జియో వినియోగదారులంతా మార్చి 31లోపు జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవాలని.. మెంబర్‌షిప్‌ తీసుకుంటేనే జియో అందిస్తున్న సదుపాయాలు వర్తిస్తాయని గతంలో జియో కోరింది. . మార్చి 31న జియో వెబ్‌సైట్‌, యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందలేకపోయారు. దీంతో వినియోగదారుల ఒత్తిడి మేరకు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను 15రోజులపాటు పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించిది. అంతే కాకుండా సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ పేరుతో రూ.303, అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకుంటే ప్రస్తుత ఆఫర్ మరో మూడు నెలలపాటు కొనసాగుతుందని జియో ప్రకటించింది. అయితే తాజాగా ‘జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌’ పొడిగింపు నిర్ణయాన్ని, రూ.303కే 3 నెలల పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని రిలయన్స్‌ జియోకు ట్రాయ్‌ సూచించింది.

ట్రాయ్ ఆదేశాలపై స్పందించిన జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ ఉపసంహరణకు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఈ ఆఫర్‌ను ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే ఇప్పటికే రూ.303 అంతకంటే ఎక్కువ చెల్లించి ఈ ఆఫర్ పొందినవారికి మాత్రం ఈ ఆఫర్ కొనసాగుతుందని జియో స్పష్టం చేసింది. కేవలం రూ.303కే మూడు నెలలపాటు ఉచిత కాలింగ్‌, రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని కొత్త ఆఫర్‌ను ప్రకటించి మరింత మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

- Advertisement -