మెరిసిన తాహీర్‌, స్టీవ్‌, రహానె.. జెయింట్‌ బోణీ

118
RPSG vs MI - Match 2, Pune, IPL 2017
RPSG vs MI - Match 2, Pune, IPL 2017

ఐపీఎల్‌లో గురువారం పూణే వేదికగా జరిగిన మ్యాచ్లో 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన పుణె సూపర్‌ జెయింట్‌ లక్ష్యాన్ని19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మిత్‌, అజింక్య రహానె (60; 34 బంతుల్లో 6×4, 3×6) మెరిసిన వేళ గురువారం ముంబయి ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ముంబయి ఇండియన్స్‌పై గెలవాలంటే రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌కు కావాల్సింది 6 బంతుల్లో 13 పరుగులు! క్రీజులో ధోని (12 బంతుల్లో 12 నాటౌట్).. పొలార్డ్‌ చేతిలో బంతి! తొలి మూడు బంతులకు వచ్చింది 3 పరుగులే! 3 బంతుల్లో 10 పరుగులు చేయాలి! ఈ స్థితిలో కొత్త కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (84 నాటౌట్‌; 54 బంతుల్లో) వరుసగా రెండు సిక్సర్లు బాది అదిరే ముగింపునిచ్చాడు. ఐపీఎల్‌-10లో పుణెకు గొప్ప ఆరంభాన్నిచ్చాడు.

అంతకుముందు టాస్ ఓడీ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టాస్ గెలిచిన పూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముంబై ఇండియన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కీపర్ పార్థివ్ పటేల్, జోస్ బట్లర్ జోడీ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. తొలి రెండు ఓవర్లు పార్థివ్ దూకుడుగా ఆడితే…మూడో ఓవర్ బెన్ స్టోక్స్ వేయగా, జోస్ బట్లర్ దూకుడు ప్రదర్శించాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది స్టేడియంలో ఉత్సాహం నింపాడు. అనంతరం అద్భుతమైన బంతితో పార్థివ్ పటేల్ (19) ను పెవిలియన్ కు పంపిన తాహిర్… 7వ ఓవర్ 3వ బంతికి రోహిత్ శర్మ (3) ను బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ ఐదవ బంతికి జోస్ బట్లర్ (38) ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు.చివర్లో హార్థీక్ పాండ్య(35), రానా(34), పొలార్డ్‌(27)లు బ్యాట్ ఝులిపించడంతో ముంబై ఇండియన్స్ 184 పరుగులు చేయగలిగింది. పేసర్‌ అశోక్‌ దిండా వేసిన ఆఖరి ఓవర్లో ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్య సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా మూడు సిక్సర్లు బాదిన అతను.. నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. ఐదో బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపిన పాండ్య.. స్కోరును అమాంతం పెంచాడు.

ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్ ను ఎవరూ కొనగోలు చేయని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులు ముందు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ ను పుణె జట్టులోకి తీసుకుంది. జట్టు పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్ లోనే తన ప్రతాపాన్ని చూపించాడు తాహీర్.