ఎల్‌టీటీఈ చీఫ్‌గా మంచు మనోజ్…!

148
manchu-manoj-ltte-prabhakaran

మంచు మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఒక్కడు మిగిలాడు. అజయ్ ఆండ్య్రూస్ నౌతాక్కి డైరెక్షన్‌లో తెరకెకుతున్న ఈ మూవీకి సంబంధించి మనోజ్ లుక్స్ బయటికొచ్చాయి. 1990 బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మనోజ్ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్ రోల్‌తోపాటు విద్యార్థి నాయకుడిగా డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడు. వీటిలో ఎల్‌టీటీఈ చీఫ్ పాత్ర లుక్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. 1990లో శ్రీలంకలోని 15లక్షల మంది శరణార్థుల కోసం జరిగిన యుద్ద నేపథ్యంలో ఒక్కడు మిగిలాడు తెరకెక్కుతున్నది. విద్యార్థి నాయకుడి పాత్రకు సంబంధించి ఇవాళ షూటింగ్ ప్రారంభమైనట్లు మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

unnamed

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మనోజ్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఎల్‌.టి.టి.ఈ మిలిటెంట్‌ ప్రభాకరన్‌ పాత్ర ఒకటి. కాలేజీ విద్యార్థి పాత్ర కోసం 12 కిలోల బరువు తగ్గారు. 1990 నాటి శ్రీలంక యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. వాస్తవిక కోణంలో సాగుతుంది. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలోనే ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు.