వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ నేడు మొదలైంది. హైద్రాబాద్ లోని అల్యూమినమ్ ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. “నేటి నుంచి మొదలైన ఆఖరి షెడ్యూల్ ఈ నెలాఖరుకు ముగుస్తుంది. ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారు.
ఈ షెడ్యూల్ పనులతోపాటు.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మంచు మనోజ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తుండగా.. స్టూడెంట్ క్యారెక్టర్ కోసం దాదాపు 12 కేజీలు తగ్గడం విశేషం. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం” అన్నారు.
మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి!