సౌతాఫ్రికాతో టీ20..భారత్ ఓటమి

309
ind vs sa
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ తొలి ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విధించిన 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 5 వికెట్ల తేడాతో గెలుపొందారు. మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్.. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 133 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో సూర్య కుమార్ యాదవ్ మినహా ఎవరూ రాణించలేదు. సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 15 (14), కేఎల్ రాహుల్ 9 (14), విరాట్ కోహ్లీ 12 (11) పరుగులకే వెనుదిరిగారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది భారత్.

ఇవి కూడా చదవండి..

మనకు ఓబ్యాడ్‌ కెప్టెన్‌ ఉన్నాడు:షోయబ్‌

టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం..

రూసో సూపర్ షో..బంగ్లా ఓటమి

- Advertisement -