- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొలేక బీజేపీ నీచ రాజకీయాలు చేపట్టిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారంలో రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను కొనుగోలు చేయాలని బీజేపీ పెద్దమొత్తంలో ధనంను ఇవ్వజూపాలని చుశారు.
ఈ తరుణంలో తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రాథమిక విచారణ దశలో ఉందన్నారు. కాబట్టి టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ సంయనం పాటించాలిని సూచించారు. అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతారని వాటిని పట్టించుకొవద్దని కూడా సూచించారు.
- Advertisement -