సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతీచోటా బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా పుష్ప వసూళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దర్శకుడు తేజ.
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సినిమాకు అన్ని చోట్ల లాభాలు రాలేదని చెప్పగా ఆ కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీంతో వివాదం మరింత ముదరక ముందే తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు తేజ. టికెట్ రేట్ పెరిగి ఉంటే ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చేవి అని చెప్పాను అని తెలిపారు. ఒక యావరేజ్ సినిమాకు టికెట్ రేట్స్ పెరిగి మంచి వసూళ్లు వస్తే పుష్ప సినిమాకు మాత్రం ఫ్లాప్ మూవీలా వసూళ్లు తక్కువ వచ్చాయని అన్నానని తెలిపారు.
సుకుమార్ తన ఫేవరేట్ దర్శకుడని అతడు ఎలాంటి సినిమా తీసినా తనకు నచ్చుతుందన్నారు. ఓ సినిమా హిట్, ఫ్లాప్ అని చెప్పే అర్హత తనకు లేదని… ఎందుకంటే నేను అన్ని హిట్ సినిమాలు తీయలేదన్నారు.