చిరు – పూరి మూవీపై ఆర్జీవీ మార్క్ కామెంట్స్‌..

108
- Advertisement -

గాడ్ ఫాదర్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరిన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తానని ప్రకటించగా ఇక చిరు కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నానని తెలిపారు పూరి. గతంలో చిరు కోసం రెడీ చేసిన ఆటోజానీ కథను పక్కన పెట్టేశానని దానికి మించిన కథను రెడీ చేస్తున్నానని తెలిపారు.

దీనిపై ఆర్జీవీ స్పందించారు. ఎప్పుడూ పరోక్షంగా మెగాస్టార్‌ని టార్గెట్ చేసే ఆర్జీవీ ఈసారి మాత్రం కాస్త విచిత్రంగా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. సినిమా అంటే ప్రాణం ఇచ్చే ఇద్దరు వ్యక్తులు ఒక సినిమా కోసం కలవబోతున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా అని పేర్కొన్నారు.

ఇక చిరు నటించిన గాడ్ ఫాదర్‌ రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. గాడ్‌ ఫాదర్‌ సినిమాతో ఆచార్య ఫ్లాప్‌ను చెరిపేశారు చిరు.

- Advertisement -