త్రివిధ దళాల అంచనాలను నెరవేరుస్తా :కొత్త సీడీఎస్‌

93
- Advertisement -

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. బిపిన్ రావత్ మరణంతో అనిల్ చౌహాన్ ను ఇటివలే కొత్త సీడీఎస్ గా కేంద్రం నియమించింది. బిపిన్‌ రావత్‌ వారసుడిగా త్రివిధ దళాల సమన్వయ కర్తగా వ్యవహరించనున్న అనిల్‌…. అంతకుముందు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టినందుకు గర్వంగా ఉందని అనిల్ చౌహాన్ తెలిపారు. త్రివిధ దళాల అంచనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అన్ని సవాళ్లు, ఇబ్బందులను సమిష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు.

అనిల్ చౌహాన్ ఆర్మీలో దాదాపు 40ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతామండలి సలహాదారుడిగా కొనసాగారు. అనిల్‌ చౌహాన్‌ జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపులను నిరోధించడంలో విశేష అనుభవం ఉంది. సైన్యంలో తన సేవలకు గానూ చౌహాన్ పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం సహా పలు పతకాలను అందుకున్నారు.

- Advertisement -