సీఎం కేసీఆర్‌తో విజయ్‌ దర్డా మీటింగ్‌ @ ప్రగతి భవన్‌

149
- Advertisement -

లోక్ మత్ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా గురువారం నాడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులతో పాటు,  దేశ రాజకీయాలపై ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో దర్డా చర్చించారు. దేశ ప్రతిష్ట బీజేపీ వల్ల దిగజారుతున్నాయని, ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం దేశానికి తక్షణావసరమని చర్చల సందర్భంగా విజయ్ దర్డా స్పష్టం చేశారు.

 ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తెలంగాణలో ఉద్యమాలు నిర్వహించి, సీఎం కేసీఆర్‌  రాష్ట్రాన్ని సాధించడం గొప్ప విషయమని విజయ్ దర్డా అన్నారు. తెలంగాణ సాధించడంతోనే కాకుండా  అనతికాలంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిదుతున్న తీరు అమోఘమన్నారు.  పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్జత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకుడు సమకాలీన రాజకీయాల్లో…తెలంగాణ నుంచి ఎదగడం దేశానికి గొప్ప విషయమన్నారు. కేంద్రంలోని బీజీపీ అసంబద్ధమైన పాలన వల్ల అన్ని రంగాలు దిగజారిపోతున్నాయని, సామాజిక సంక్షుభిత వాతావరణం నెలకొంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేసీఆర్‌లాంటి ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్‌ను విజయ్ దర్డా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాజకీయా పాలనా అనుభవం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుడదని అన్నారు. అందుకు సీఎం కేసీఆర్‌ విజయ్ దర్డాకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి.

- Advertisement -