మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ . ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాడ్ ఫాదర్ ట్రైలర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు. చిరంజీవి యాక్షన్ పవర్‌పుల్ డైలాగ్స్ తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరు కొత్త లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
గాడ్‌ఫాదర్ మూవీ మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసీఫర్ రీమేక్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసీఫర్ కథలో చాలా మార్పులు చేసినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై గాడ్ ఫాదర్ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు.