మాజీ ప్రధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన నారాయణమూర్తి

72
narayana
- Advertisement -

ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గత యూపీఏ హయాంలోని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌ ఐఐఎం విద్యార్థులను, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రధాని అసాధారణమైన వ్యక్తే…కానీ దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయిందన్నారు. ఆయన  హయాంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపించారు. ఆ రోజుల్లో అంతర్జాతీయ వేదికలపైన ఎక్కువగా చైనా పేరు వినిపించేదన్నారు. భారతదేశం పేరును చాలా తక్కువగా, అరుదుగా వినిపించేదని తెలిపారు.

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడూ దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయని నారాయణమూర్తి అన్నారు. ఇప్పుడ అలాంటి పరిస్థితి లేదన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థను దీటుగా ఏదుర్కొవాలంటే కేవలం భారతదేశ యువతకు మాత్రమే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -