ప్రియాంక చోప్రా @ నెంబర్ 2

222
PC is beauty No.2 in the world
- Advertisement -

ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో సత్తాచాటిన ఈ బ్యూటీ హలీవుడ్‌లో సైతం పాగావేసింది. తన అందచందాలను ఆరబోస్తోంది. ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్‌ షోను ప్రదర్శిస్తోంది. అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక క్వాంటికో సిరీస్‌తో తెగ పాపులరైపోయింది. ఈ టీవీ సిరీయల్‌లో నటించినందుకు గాను ప్రియాంకాకు పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది.

తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఖాతాలో మరో మైలురాయి చేరింది. 2017 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని అత్యంత అందమైన 30 మహిళల్లో ఆమె 2వ స్ధానం సంపాదించింది. ఈ పోటీల్లో హాలీవుడ్ నటి, పాప్ గాయని బేవన్స్ మొదటి స్ధానంలో నిలిచింది.

ప్రముఖ ఆన్ లైన్ మీడియా సంస్థ ‘బజ్ నెట్’ ఈ జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా, ప్రియాంక తన అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది. బియాన్స్ కు, తనకు అనుకూలంగా ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తొలి స్థానంలో ఉండటానికి బియాన్స్ అర్హురాలని తెలిపింది. రెండో స్థానాన్ని కైవసం చేసుకునే క్రమంలో ఎమ్మా స్టోన్, ఏంజిలీనా జోలీ, మార్గోట్ రోబీ, బ్లేక్ లైవ్లీ, ఎలిసియా వికందర్ లాంటి హాలీవుడ్ భామలను ప్రియాంక అధిగమించింది.

- Advertisement -