ఏపీలోనూ పార్టీ పెట్టండి…

179
TRS to be expanded in Andhra Pradesh
- Advertisement -

ఏపీ ప్రభుత్వ పనితీరు కంటే తెలంగాణ ప్రభుత్వ పనితీరు వందశాతం ఉత్తమమని కితాబిస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే  తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ దగ్గరి నుంచి పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌ పనితీరుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ తొలిస్ధానంలో నిలవడం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని జాతీయ పత్రికలు సైతం ఎన్నో వ్యాసాలు రాశాయి.

అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంటే మ‌రో తెలుగు రాష్ట్రం ఏపీలో ఇంతటి అభివృద్ది క‌న‌బ‌డ‌టం లేద‌ని స్వ‌యంగా అక్క‌డి ప్ర‌జ‌లే చెబుతున్నారు. ఏకంగా మంత్రి కేటీఆర్‌కే అక్క‌డి ప‌రిస్థితిని వివ‌రిస్తూ ట్వీట్ చేస్తున్నారు కొందరు. కేటీఆర్ గారూ.. ఏపీ రాజకీయ నేతలతో విసుగెత్తిపోయం.. ప్రభుత్వ పాలన నచ్చడం లేదు.. టీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా విస్తరించండి.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశాడు

ఆ యువ‌కుడు చేసిన ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. తెలంగాణ‌లో బోలెడ‌న్ని ప‌నులున్నాయి. వాట‌న్నిటినీ నెర‌వేర్చాల్సిన బాధ్య‌త మాపై ఉంది బ్ర‌ద‌ర్‌. మా పాల‌న‌ను గుర్తించినందుకు థ్యాంక్స్ అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. కేటీఆర్ కు ఏపీ నుంచి ట్విట్.. అందుకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

TRS to be expanded in Andhra Pradesh

- Advertisement -