పల్లెప్రగతితో రాష్ట్రానికి అవార్డుల పంట..

110
ktr
- Advertisement -

స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ జిల్లాల్లో జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా రాష్ర్టానికి వివిధ క్యాటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు వరించాయి.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ మానసపుత్రిక పల్లె ప్రగతి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్..రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటామని, ప్రశంసలు అందుకుంటామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జీ) పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని చెప్పారు.ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అమలుచేస్తున్న పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, అధికారులు, 12,769 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులను అభినందించారు.

- Advertisement -