బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇక మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఇద్దర్ని నామినేట్ చేసి వాళ్ళ ముఖానికి రంగు పూయాలని చెప్పారు.
ఇక ఫస్ట్ వచ్చిన శ్రీసత్య.. ఆరోహి, ఇనయాలను నామినేట్ చేసింది. సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేశావని ఇనయా ఫైర్ అయ్యింది. తర్వాత వచ్చిన గీతూ.. సుదీప, చంటిలను నామినేట్ చేయగా, సుదీప, గీతూల మధ్య పెద్ద గొడవే జరిగింది.
ఇక చంటి.. గీతూ, రేవంత్లను నామినేట్ చేశాడు. ఇనయా.. గీతూ, రేవంత్లను నామినేట్ చేయగా ఆదిరెడ్డి.. ఇనయా, వాసంతిలను నామినేట్ చేశాడు. సుదీప.. గీతూ, శ్రీహాన్లను నామినేట్ చేయగా బాలాదిత్య.. ఆరోహి, రేవంత్లను నామినేట్ చేశాడు. వాసంతి.. ఆదిరెడ్డి, నేహాలను నామినేట్ చేయగా మరీనా, రోహిత్ .. రేవంత్, పైమాలను నామినేట్ చేసింది. ఆర్జే సూర్య.. రేవంత్, బాలాదిత్యలను నామినేట్ చేశాడు.
హౌస్ లో అత్యధిక ఓట్లు పడ్డ రేవంత్, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వాసంతి, నేహా, శ్రీహాన్ మూడో వారం నామినేషన్స్ లో ఉన్నారు. దీంతో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారో వేచిచూడాల్సిందే..