సీనియర్ నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పోస్టు కోవిడ్ సమస్యలు రావడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆయన చేరారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆయన చాలా బాధపడ్డారు. దాంతో పరిస్థితి అత్యంత విషమంగా మారిన ఆయన.. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.
చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో విశేష సేవలను అందించారు.