ఇంటి సభ్యులకు క్లాస్ ఇచ్చిన నాగ్!

102
nag
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్‌, వీకెండ్‌ ప్రక్రియలో భాగంగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటి సభ్యులకు క్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా ఇంట్లో అందరిపై పెత్తనం చలాయిస్తున్న గలాట గీతూకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అలాగే ఆది రెడ్డి, రేవంత్‌, చంటికి కౌంటర్ ఇచ్చారు. ఇక సంచాలక్‌గా ఫైమా చేసిన పనిని మెచ్చుకున్నారు నాగ్.

సింగర్ రేవంత్ గురించి మాట్లాడుతూ.. నువ్ ఎంతో చూసి వచ్చావ్.. ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి.. అంటూ కాస్త చురకలు అంటించాడు. ఆదిరెడ్డిని రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడమంటూ సలహాలు ఇచ్చాడు. అభినయ.. అంతగా ఆడటం లేదు.. అర్జున్ కల్యాణ్.. నీ ఆటకు థమ్స్ అప్ అని మెచ్చుకున్నాడు. శ్రీ సత్య మాత్రం కేవలం తింటోంది తప్పా ఆడటం లేదన్నట్టుగా కౌంటర్లు వేశాడు.

ఫైమా.. సంచాలక్‌గా సూపర్.. ఒక్క విషయంలో నాకు నచ్చలేదు.. బల్లితో పోల్చుకోవడం నచ్చలేదు అంటూ ఫైమా గురించి నాగ్ అన్నారు. శ్రీహాన్.. బయట ఉన్నోళ్ల పేర్లు నేను తీస్తే లేని ప్రాబ్లం.. ఎవరో తీస్తే ఏంటి ప్రాబ్లం అని ప్రశ్నించారు నాగ్. ఉడాల్ మామ.. అద్భుతంగా ఆడుతున్నావ్.. అన్నీ ఘటనల్లో రివ్యూలు వద్దు.. ఆట ఆడేటప్పుడు.. ఎంపైర్ మధ్యలోకి రాడు కదా? అని తెలిపారు.

గీతూ.. బాగా ఆడుతున్నావ్.. థమ్స్ అప్.. బాత్రూం విషయం చెప్పిన తీరు తప్పు.. పదే పదే ఆమెను తిక్కదానా? అనడం బాగా లేదు. సంబంధం లేని విషయంలో దూరితే జైల్లో వేస్తారు అని గీతూకి గడ్డి పెట్టాడు నాగార్జున. చివరకు రేవంత్ వెన్ను పోటు దారుడిగా గీతూ గుంటనక్క అయింది.

- Advertisement -